Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుబీసీ రిజర్వేషన్ల అమలుకు 9,10 తేదీల్లో ధర్నాలు

బీసీ రిజర్వేషన్ల అమలుకు 9,10 తేదీల్లో ధర్నాలు

- Advertisement -

బీహార్‌లో ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ రేపు నిరసనలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసేం దుకు పార్లమెంటులో చట్టం చేయాలనీ, తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 9,10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిం చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం పిలుపునిచ్చింది. ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వర్గ సమావేశాన్ని బుధవారం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య అధ్యక్షతన హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో నిర్వహించారు. రాష్ట్రం లో రాజకీయ పరిస్థితిని, భవిష్యత్‌ కర్తవ్యాలను చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. బీహార్‌లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించి, అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని కుట్రపన్ను తున్నదని విమర్శించారు. దాదాపు 64లక్షల ఓట్లను ఎన్నికల కమిషన్‌ తొలగించిందని తెలిపారు. ఇందులో అత్యధికంగా మైనార్టీలు, ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లే ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేస్తారని భావించి తొలగించిందని విమర్శించారు. ఎస్సీ నియోజకవర్గాల్లో 40 నుంచి 60 శాతం ఓట్లను తీసేసిందని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం అండదండలతో బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నదని పేర్కొన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని, కలిసొచ్చే శక్తులన్నింటినీ కలుపుకుని ఐక్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఉద్యమించాలని కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి హక్కులను సాధించుకునేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు మైనార్టీలు పొందకూడదని అక్రమ పద్ధతుల్లో బీజేపీ నాటకమాడుతున్నదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌, యూపీ, ఇతర రాష్ట్రాల్లో మైనార్టీలకు బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో మాత్రం దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నదని పేర్కొన్నారు. ముస్లిముల్లో దూదేకుల తదితర అట్టడుగు తరగతుల వారున్నారని వివరించారు. వెనుకబడినవారు కాబట్టే వారికి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం లేదన్న విషయాన్ని మండల్‌ కమిషన్‌ కూడా చెప్పిందని గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ ఆ పద్ధతులను ఉపసంహరించుకుని, రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు జరిగేలా కేంద్రంలో చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అలాంటి కార్యక్రమానికి తమ పార్టీ మద్దతునిస్తుందని తెలిపారు. ఈనెల 9,10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad