Sunday, December 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధి హామీ రద్దుకు నిరసనగా రేపు ఆందోళనలు

ఉపాధి హామీ రద్దుకు నిరసనగా రేపు ఆందోళనలు

- Advertisement -

కేవీపీఎస్‌, టీజీఎస్‌ పిలుపు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయటాన్ని నిరసిస్తూ ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌), తెలంగాణ గిరిజన సంఘం పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆ సంఘాల రాష్ట్ర కార్యదర్శులు టి స్కైలాబ్‌బాబు, ఆర్‌ శ్రీరాంనాయక్‌ శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి బి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యవల్ల అత్యంత పేదలుగా ఉన్న దళితులు, గిరిజనులు ఉపాధి అవకాశాలను కోల్పోతారనీ అన్నారు. ఇది పేదల ఉపాధికి తూట్లు పొడిచే చర్య అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పాత చట్టాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -