- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
హైదరాబాద్‌లో గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించే తలపెట్టిన మహాధర్నకు వెళ్లకుండా మంగళవారం ఉదయం ఉప్పునుంతల పోలీసులు గ్రామపంచాయతీ కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా అరెస్ట్ అయిన ఆలూరి రమేష్, భీమయ్య, రాజలింగం, ముత్యాలమ్మ, నవనీత మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
- Advertisement -



