- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆర్ఎంపీ, పీ ఎంపీలు పరిమితులకు లోబడి ప్రధమ చికిత్స వరకే ఇవ్వాలని అతిక్రమిస్తే శాఖాపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అశ్వారావుపేట పీహెచ్ సీ వైద్యులు డాక్టర్ రాందాస్ హెచ్చరించారు. జాతీయ వైద్యులు దినోత్సవం పురస్కరించుకుని ఆర్ఎంపీ లతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పలు సూచనలు చేసారు. అనంతరం ఆర్ఎంపీ,పీఎంపీ మండల కమిటీ ఆద్వర్యంలో డాక్టర్ రాందాస్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు సత్యవరపు జగదీష్, బాధ్యులు క్రిష్ణా రావు, మండల అధ్యక్షకార్యదర్శులు సత్యవరపు చంద్రశేఖర్, వేల్పుల సత్యనారాయణ యాదవ్, మడిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -