Monday, January 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకర్ల రాజేశ్‌ కుటుంబానికి న్యాయం చేయండి

కర్ల రాజేశ్‌ కుటుంబానికి న్యాయం చేయండి

- Advertisement -

– రాహుల్‌ గాంధీకి కవిత ట్వీట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పోలీస్‌ కస్టడీలో లాకప్‌ డెత్‌ అయిన కర్ల రాజేశ్‌ కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ట్వీట్‌ చేశారు. లాకప్‌ డెత్‌ అయిన కుమారుని కోసం విలపిస్తున్న దళిత మహిళ ఆక్రందన వినాలని ఆమె కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచాయనీ, ఇంకెప్పుడు రోహిత్‌ వేముల చట్టం తెస్తారని కవిత ప్రశ్నించారు. దళితులపై ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని ఆమె సూచించారు. వెంటనే రోహిత్‌ వేముల చట్టం తేవాలనీ, కర్ల రాజేశ్‌ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. లాకప్‌ డెత్‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదేశించాలని రాహుల్‌ గాంధీని కవిత డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -