లేనియెడల పోరాటాలను ఉదృతం చేస్తాం
వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వంగూరు రాములన్న డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : వీఆర్ఏ వారసులకు గ్రామ పరిపాలన అధికారి గా అవకాశం కల్పించండి లేనియెడల పోరాటాలను ఉదృతం చేస్తాం అని వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వంగూరు రాములన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వీఆర్ఏల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సి ఐ టి యు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లో వి ఆర్ ఎ లు 84 రోజుల సుదీర్ఘ సమ్మె పోరాట ఫలితంగాజి వో 81&85 జూలై 2013 లో విడుదల చెయ్యడం జరిగింది. కానీ ఎలక్షన్స్ రావడం.. అప్పుడున్న ప్రభుత్వం మారడం లాంటి పరిణామాలు జరిగి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వచ్చింది.
ఈ ప్రభుత్వం ధరణిలో మార్పులు చేసి రెవిన్యూ వ్యవస్థ పటిష్ఠం చెయ్యాలని నిర్ణయం తీసుకుంటున్న సమయంలో 20 నెలలు గడిచిపోతున్నాయి. అయినా చిరుద్యోగులైన వి ఆర్ ఎ 61+ వారికి మాత్రం ఇంకా నియామక ఉత్తర్వులు పెండింగ్ లోనే ఉన్నాయి. జి వో 81/2023 మరియూ 85/2023 వచ్చి 20 నెలలు గడుస్తున్నాయి. ప్రజా ప్రభుత్వం వచ్చి 16 నెలలు గడుస్తున్నాయి. ప్రభుత్వం భూ భారతి చట్టం 2025 తర్వాత ఆర్డర్లు ఇస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న 3797 కుటుంబాలు, అలాగే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉగాదికి గ్రామ పరిపాలన అధికారి(జి పి వో) గతంలో సర్దుబాటు చేసిన వి ఆర్ ఓ ల నుండి గూగుల్ ఫాం లో ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది.
అలాగే ఈ 3797 వి ఆర్ ఎ 61+ వారసుల వివరాలు కూడా ప్రభుత్వం సి సి ఎల్ ఏ 20 నెలల క్రితమే తీసుకున్నారు కాబట్టి వీరికి కూడా జి పి వో లో అవకాశం కల్పించి నియామక ఉత్తర్వులు ఇవ్వాలి.
అలాగే ఈ వారసులు కూడా దాదాపు 10-12 సంవత్సరాలుగా వారి తల్లిదండ్రుల స్థానంలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అనుభవం కూడా ఉన్నది. జి వో వచ్చిన సందర్భంలో కుటుంబ సభ్యుల నుంచి నో అబ్జెక్షన్ అడిగిన విషయంలో ప్రభుత్వ ఉద్యోగo అని ఆశతో కుటుంబ సభ్యులు వారికి ఉన్న ఆస్తుల్లో వాట వదులుకోవడం, ఆస్తులు లేని వారు అప్పులు తెచ్చి ఇవ్వడం జరిగింది. ఆ కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఇప్పటివరకు దాదాపు 70 మంది వారసులు చనిపోయారు. అలాగే వయో భారంతో దాదాపు 400 వరకు 61 నిండిన వి ఆర్ ఎ లు చనిపోవడం జరిగింది. ప్రభుత్వం జి వో. నెంబర్ 81& 85/2023 ప్రకారం వెళ్ళిన వారినీ జి పి వో లుగా తీసుకుంటున్నారు కాబట్టి అదే జి వో లో మిగిలిన 61+ వి ఆర్ ఎ వారసుల 3797 మందికి ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి.
కాబట్టి ఆ పోస్టులు కూడా సూపర్ న్యూమరరీ అని క్రియేట్ చేశారు. ఆ ఖాళీ అయిన స్థానాల్లో వి ఆర్ ఎ 61+ వారసులను నియమించాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వంగూరు రాములన్న ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ కన్వీనరు వంగూరు రాములు అన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జిల్లా అధ్యక్షుడు ఇస్తరి గంగామల్లు, నిజామబాద్ డివిజన్ అధ్యక్షుడు గోధుమ మోహన్ , బోధన్ డివిజన్ అధ్యక్షుడు కరుణాకర్, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.