హైకోర్టులో పిటిషన్ దాఖలు
వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎన్నికల హామీ మేరకు తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు పింఛన్, ఇంటి స్థలం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ఉద్యమ కారులకు ఇంటిస్థలం, పింఛన్ ఇవ్వాలనే వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఇంటిస్థలం, పింఛన్ ఇస్తామన్న ఎన్నికల హామీ మేరకు కలెక్టర్ స్వీకరించిన వినతిపత్రాలపై చర్యలు తీసుకోలేదంటూ జి నాగరాజు, కె యాదగిరి మరో ఏడుగురు వేసిన పిటిషన్లను జస్టిస్ బి విజరు సేన్‌రెడ్డి సోమవారం విచారించారు. పిటిషనర్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎంతో నష్టపోయారనీ, కేసుల వల్ల ఉద్యోగాలకు కూడా దూరమయ్యారని పిటిష నర్ తరఫు న్యాయవాది చెప్పారు. కేసుల కారణంగా ఉద్యోగాలను కూడా పొందలేకపోయారనీ, కేసుల కారణంగా కోర్టులకు వెళ్తు ఉద్యోగాలకు అర్హత కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోయారని వివరించారు. కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే 250 గజాల ఇంటి స్థలం, పింఛన్ ఇస్తామని హామీ అమలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలపై న్యాయమూర్తి కల్పించుకుని, ఒక పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఎన్నికల హామీలపై ఆధారపడి పిటిషన్ ఎలా వేస్తారనీ, జీవో అనేది విధాన పరమైనదనీ, జీవో లేకుండా పథకాలు అమలు చేయాలని పిటి షన్ వేసేందుకు వీల్లేదని చెప్పారు. ఎన్నికల హామీని ఇంకా నమ్ముతున్నా, ఇంటి స్థలం, పింఛన్ ఇస్తామనే ఎన్నికల హామీ అమలుకు ఉత్తర్వులను జారీ చేయ బోమని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తే దేశ సమరయోధుల తరహాలో స్థలాలు ఇవ్వాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. వేలకు వేల మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారనీ, అలాంటి వాళ్లదందరికీ 250 గజాల స్థలం ఇవ్వడం సాధ్యం కాదన్నారు. దీనిపై న్యాయవాది కల్పించుకుని, ప్రభుత్వం ఇప్పటికే యాదగిరి మరొకరికి ఇంటి జాగా ఇచ్చిందని వివరించారు. దీని జీవోలు బయటకు రాలేదన్నారు. ప్రభుత్వ వివరణ కోసం విచారణ ఈనెల 23కు వాయిదా పడింది.
తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



