Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

- Advertisement -

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి 
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల/ అలంపూర్

పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, నాణ్యమైన విద్యను అందించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్  సీతా దయాకర్ రెడ్డి సూచించారు.

బుధవారం అలంపూర్‌లోని అంగన్వాడీ కేంద్రం,కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) ను,అనంతరం గద్వాలలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు విద్యార్థులతో స్నేహపూర్వకంగా ముచ్చటించి, అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించి,ఆహార నాణ్యతపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. పిల్లల విద్యా సామర్థ్యాలను వారిని చదివించటం ద్వారా తెలుసుకున్నారు.దేశ భవిష్యత్ పిల్లలపైనే ఆధారపడి ఉంటుందని, వారి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లల అభ్యాస పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు మరింత సృజనాత్మకంగా బోధించాలన్నారు. విద్యతో పాటు పిల్లలకు నైతిక విలువలు, సామాజిక అవగాహన, మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు అపర్ణ,ప్రేమలత అగర్వాల్,వందన,చందన,వచన్ కుమార్,అడిషనల్ కలెక్టర్ నర్సింగ్ రావు,జిల్లా సంక్షేమ అధికారి సునంద,ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పవన్,డీసీపీఓ నరసింహ,సీడీపీఓ సుజాత,సీవీసీ చైర్మన్ సహదేవుడు, మెంబర్ శైలజ, తహసీల్దార్ మంజుల దేవి, ఎంఈఓ అశోక్,సూపర్వైజర్ నర్గీస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -