కస్తూర్బా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డీఈవో బొల్లారం బిక్షపతి
నవతెలంగాణ – కట్టంగూర్
కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిఈఓ బొల్లారం బిక్షపతి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గుణాత్మక విద్య అమలు, విద్యార్థుల స్థాయిని అడిగి తెలుసుకున్నారు.పదోతరగతి విద్యార్థులు ఇప్పటి నుండే ప్రణాళిక బద్ధంగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని చెప్పారు.వంటగదిని పరిశీలించి విద్యార్థులకు వడ్డించే ఆహారం వివరాలను సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు. అంతకుముందు కలిమెరా లోని ప్రాథమిక పాఠశాలని సందర్శించారు. ఆయన వెంట మండల విద్యాధికారి అంబటి అంజయ్య కేజీబీవీ ఎస్ఓ నీలాంబరి, కలిమెర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నర్రా సరళ, ఉపాధ్యాయులు ఉన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES