Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

- Advertisement -

నవతెలంగాణ – కొల్లాపూర్
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని బిఆర్ఎస్వి విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు డి శేఖర్ అన్నారు. బుధవారం కొల్లాపూర్ లో గాంధీ హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు తక్షణమే వంట బిల్లులు చెల్లించాలని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వ అధికారులు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు అజయ్ నితీష్ తరుణ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -