- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని అల్లినగర్ టిడబ్ల్యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ఏ సి ఎం ఓ లక్ష్మయ్య అన్నారు. మంగళవారం మండలంలోని అల్లినగర్ టి డబ్ల్యూ పిఎస్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు పట్టుకుని పరిశీలించారు. విద్యార్థుల చదువుపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ పాఠశాలకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆశ్రమ స్కూల్ కాంప్లెక్స్ ఎస్ఎస్సి ఆర్ పి రఘునాథం పాఠశాల ఉపాధ్యాయులు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



