Wednesday, December 31, 2025
E-PAPER
Homeకరీంనగర్విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి..

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి..

- Advertisement -

– కేజీబీవీ పాఠశాలను సందర్శించిన పద్మనగర్ సర్పంచ్ 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలకు నాణ్యమైన భోజనాన్ని వండి అందించాలని నిర్వాహకులకు పద్మ నగర్ సర్పంచ్ మోర నిర్మల సూచించారు. మండలంలోని పద్మ నగర్ లో ని కస్తూరి గాంధీ బాలికల పాఠశాలను సర్పంచ్ మూర నిర్మల బుధవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణ పరిశీలించారు. అలాగే విద్యార్థులకు భోజనం అందించే వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం స్వచ్ఛమైన ఆకుకూరలను, కూరగాయలను వండి మంచి రుచికరమైన ఆహారాన్ని అందించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా గ్రామపంచాయతీ పక్షాన పూర్తిస్థాయిలో అండగా ఉంటామన్నారు. విద్యార్థినిలు ఆటల పోటీలు ఆడుకునేందుకు వీలుగా క్రీడా మైదానాన్ని పూర్తిస్థాయిలో  త్వరలోనే సిద్ధం చేస్తామని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆమె వెంట పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామల ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -