Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

 విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

- Advertisement -

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి తెలిపారు. మంగళవారం నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గిరిజన గురుకుల కళాశాల, పాఠశాల.మరియు నాచుపల్లి మినీ గిరిజన గురుకుల పాఠశాలాలను ఆకస్మికంగా తెలియజేశారు. పాఠశాల భోజనం అమలు తీరుపై ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలను నెరవేర్చే లాగా పని చేయాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.

పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ను విద్యను అందించాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించి 100శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, గురుకులంలోని మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. నిల్వ ఉన్న వస్తువులను కోడిగుడ్లను విద్యార్థులకు అందించే వద్దని ఆమె సూచించారు. భోజనం కోసం తెచ్చిన సరుకులను సంచుల్లో కాకుండా డబ్బాలో ఉంచాలని సూచించారు. 

 ఉపాధ్యాయులు వంట చేసే సమయంలో దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆమె తెలిపారు. భోజనంలో కూరగాయలు పప్పులు అందించాలని నిల్వ ఉన్న కోడిగుడ్లను విద్యార్థులకు పెట్టవద్దని సూచించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారివెంట తహసీల్దార్ సువర్ణ, గిర్దవర్ వెంకటస్వామి, పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -