Friday, September 12, 2025
E-PAPER
Homeజిల్లాలుమాకు బీటీ రోడ్డు సౌకర్యాన్ని కల్పించండి 

మాకు బీటీ రోడ్డు సౌకర్యాన్ని కల్పించండి 

- Advertisement -

తొమ్మిదో వార్డు ప్రజల ఆందోళన, నాట్లు వేసి నిరసన 
సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ కు వినతి 
నవతెలంగాణ – వనపర్తి

వనపర్తి జిల్లా కేంద్రంలోని తొమ్మిదవ వార్డు పద్మావతి కాలనీలో మట్టి రోడ్లు కావడంతో వర్షాలు పడితే బురదమయం అవుతున్నాయని, బీటీ రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని 9వ వార్డుుడు ప్రజఆందోళన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి కురిసిన వర్షాలక శుక్రవారం బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ వర్షాలు కురిస్తే పద్మావతి కాలనీలోని ఏ ఇంటికి వెళ్లాలన్నా బైకులు స్లిప్ అవుతున్నాయని, బురదలో కాళ్లు మోపితే జారి పడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇండ్లకు పోవడానికి, రావడానికి రోడ్డుపైన నడవడానికి ఇబ్బందిగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తంంతం చేశారు. ఇదేే సమస్యలపై గత నెలలో రోడ్లమీద వరి నారు తెచ్చి నాట్లు వేసి నిరసన చేశామని తెలిపారు.

అయినా ప్రభుత్వ అధికారుులు, స్థానిక ఎమ్మెల్యే, మాాజీ కౌన్సిలర్లు ఏ ఒక్కరూ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 9వ వార్డులో పద్మావతి కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో గుర్తించి స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు వెంటనే నిర్మాణం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.

మటన్ షాపుల వెనకాల డ్రైనేజీలలో మటన్ వ్యర్థాలను, చెత్తాచెదారం వేయడం వేస్తున్నారని తెలిపారు. కాలనీలోని ఖాళీ ప్లాట్లలో చెట్లు విపరీతంగా పెరగడం వలన పందులు దోమలు, పాములు దుర్వాసన విపరీతంగా వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాలనీ ప్రజలకు జ్వరాలు వస్తున్నాయన తెలిపారు. వీధి స్తంభాలు వీధిలైట్లు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. కమిషనర్ సమాధానం ఇస్తూ కాలనీకి వచ్చి చూసి తక్షణమే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ లక్ష్మి, అధ్యక్షురాలు సాయిలీల, కమిటీ సభ్యురాలు లలితమ్మ, కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -