Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుపేదవాడు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా సంక్షేమాన్ని అందిస్తా

పేదవాడు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా సంక్షేమాన్ని అందిస్తా

- Advertisement -

వ్యక్తిగత పగకోసం పదవిని వాడను
ఆ స్థాయి ఉంటేనే శత్రువుగా భావిస్తా..
హాసిత భాష్పాలు పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదనీ, పేదవాడు తలెత్తుకుని తిరిగేలా పాలన సాగినప్పుడే నిజమైన అభివృద్ధి అని అంబేద్కర్‌ వ్యాఖ్యానించినట్టుగా తమ సర్కారు పేదల కోసం పనిచేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ కవి అందెశ్రీ రచించిన ‘హాసిత భాష్పాలు’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు తమపై పెద్ద బాధ్యత పెట్టారని చెప్పారు. నాలుగు కోట్ల మంది సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. సీఎం పదవి నా చేతుల్లో ఉన్నంత కాలం ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. నాలుగున్నర లక్షల మంది సొంతింటి కల నెరవేరుస్తున్నామనీ, మూడు కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు. రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన ఆనందంలో ప్రజలున్నారని గుర్తు చేశారు. ప్రతి రోజూ ప్రజలతో ఉండే అవకాశం వచ్చిందన్నారు. పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ తెలంగాణ అనీ, 2047 వరకు మూడు ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ తన లక్ష్యమని చెప్పారు. తెలంగాణ సమాజం కవులకు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ అని కొనియాడారు. ఉద్యమంలో ప్రజలకు ఎంతో మంది కవులు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. గూడ అంజన్న, దాశరథి, కాళోజీ, అందెశ్రీ, గద్దర్‌, గోరటి వెంకన్న ఇలా అనేక మంది ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కొందరు నకిలీ ఉద్యమకారులు తామే ఉద్యమకారులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. ఉద్యమకారులని చెప్పుకునే వాళ్లకు అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణతో పేగు బంధం,పేరు బంధం అన్ని తెంచుకున్నారని విమర్శించారు. దేశానికి నాయకత్వం వహించాలనే దురాశతో అన్నీ కోల్పోయారని అన్నారు. వారు అలా చెప్పుకొని తిరగడానికి కారణం.. నిజమైన ఉద్యమ కారులు ఎవ్వరూ కూడా మేము ఉద్యమకారులం అని చెప్పుకోకవడమేనని తెలిపారు. నిజమైన ఉద్యమకారులంతా గర్వంగా చెప్పుకోవాలని సూచించారు. రాజకీయాల్లో తాను ఎవరినీ శత్రువులుగా చూడననీ, అలా చూడాలన్నా వాళ్ళకి ఆ స్థాయి ఉండాలని తెలిపారు. శత్రువులకు నా గెలుపే అసలైన శిక్ష అని చెప్పారు. తనకు రాజకీయాల్లో శత్రువులెవరూ లేరన్నారు. వ్యక్తిగత పగకోసం తన పదవిని అడ్డం పెట్టుకుంటే తనకన్నా మూర్కుడు ఇంకొకరు ఉండరని అభిప్రాయపడ్డారు. తనకు అన్ని చట్ట సభల్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీరామ్‌, అందెశ్రీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad