జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్
నవతెలంగాణ – పాలకుర్తి
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో గల శ్రీ హరిత ఆసుపత్రిని సిఐ కాశీరాం నాయక్ తో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల తరహాలో గ్రామీణ ప్రాంతంలో అధునాతన వసతులతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం గ్రామీణ ప్రాంత ప్రజలకు వరం లాంటిదని అన్నారు. అన్ని రకాల వైద్య సేవలు అందించడంలో శ్రీ హరిత ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఎక్కువగా ఉంటారని, వైద్య పరంగా పేదలను ఆదుకోవడంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గుగులోతు సంజయ్ నాయక్, డాక్టర్ హరిత నాయక్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES