- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ నాయి బ్రాహ్మణుడు వీరబాబు వెరీ కోసిస్ వ్యాధితో గత కొంత కాలంగా బాధపడుతూ కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉండటంతో విషయం తెలుసుకున్న నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 31వేల ఆర్ధిక సహాయం అందజేశారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆలగడప గిరిధర్, ఉపాధ్యాయ బిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్, గౌరవ అధ్యక్షులు హనుమంతు,పట్టణ అధ్యక్షులు నరసింహ, కార్యదర్శి సైదులు, నాగవెల్లి యాదగిరి,రవి లు కుటుంబాన్ని పరామర్శించారు. వీరబాబుకు నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎప్పుడు అండగా ఉంటారని ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
- Advertisement -



