నవతెలంగాణ – భువనగిరి : భువనగిరి పట్టణం ఇందిరానగర్ కి చెందిన కోళ్ల జహంగీర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అతని తో బీచ్ మహిళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న స్నేహితులు అందరూ కలిసి వారి కుటుంబానికి రూ.20వేల నగదు, 25 కిలోల బియ్యంను అందజేశారు. ఈ సందర్భంగా బీచ్ మహేల్లా పాఠశాల ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ.. తమ మిత్రుడు కోళ్ల జహంగీర్ అకాల మృతి కలిచి వేసిందని అన్నారు.
రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో అతడి నలుగురు పిల్లల పరిస్థితి అయోమయంగా ఉందని అన్నారు. అందుకే మాకు తోచినంతగా ఆర్ధిక సహాయం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులు సుమన్, రమేష్, విజయ్ కుమార్ జాలిగం విగ్నేష్, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్, రాజు కుమార్ సంతోష్, రాధ కృష్ణ పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES