- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన మంగలి కళావతి అనారోగ్యంతో మృతిచెందగా , బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని తెలుసుకొని , గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డ్ ప్రజలు రూ.7300, కటికే తరుణ్ రూ.6000, బొంబోతుల బాలరాజు గౌడ్ కుమార్తెలు 75 కేజీల బియ్యం, వార్డు సభ్యులు మోతుకుల సాయిరాం గౌడ్ రూ.3000 బాధిత కుటుంబానికి తలో చేయి వేసి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



