Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పేదింటి ఆడపిల్లలకు పుస్తే,మట్టెలు అందజేత..

పేదింటి ఆడపిల్లలకు పుస్తే,మట్టెలు అందజేత..

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అయిత బాలచంద్రం లలిత దంపతులు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మ్యాదరి స్వప్న నాగరాజుల కుమార్తె మ్యాదరి సదా, మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామానికి చెందిన అమృత వార్ పోషవ్వ అనుమబోయి ల కుమార్తె అమృతవార్ మహితల వివాహాలకు పుస్తె మట్టే లను, వధువులకు చీరలను శ్రీ కల్కి భగవాన్ ఆలయం ద్వారా అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో కోట్ల రూపాయల డబ్బు ఉన్న పేదవారికి సహాయం చేయాలనే ఆలోచన కొద్దిమందిలో మాత్రమే ఉంటుందని అలాంటి వారిలో అయిత బాలచంద్రం లలిత దంపతులు ఇప్పటివరకు 33 మంది ఆడపిల్లల వివాహాలకు అందజేయడం జరిగిందని,108 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే,మట్టలు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. సామాజిక సేవకునిదర్శనమని వారికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్,కామారెడ్డి రక్తదాతల సమూహం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రం చంద్రశేఖర్, గోవింద్ భాస్కర్,పార్షి కామ్ శెట్టి,ఎర్రం విజయ్ కుమార్,పప్పుల శ్రావణి,పబ్బ జ్యోతి,పాత స్వరూప,పబ్బు స్వప్న  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad