- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక ప్రదానోపాధ్యాయురాలు బి.పద్మ ఆధ్వర్యంలో రూ.8 వేలు విలవగల పలు రకాల ఆటల వస్తువులు బుధవారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పిల్లలకు చదువుతోపాటు ఆటలు చాలా ముఖ్యమన్నారు. ఆటలతో అభ్యసన,సామాజిక సామర్థ్యం, ఏకాగ్రత, మానసిక, శారీరక దృఢత్వం, భావోద్వేగాల గుణాలను, జ్ఞానం, సృజనాత్మకత, క్రమశిక్షణ, నైపుణ్యాలను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -