Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు అభ్యాస దిపికలు అందజేత.!

విద్యార్థులకు అభ్యాస దిపికలు అందజేత.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూoడ్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం పదవ తరగతి విద్యార్థులకు అభ్యాస దీపికలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. తిరుపతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంచే పంపిణీ  చేసిన ఈ అభ్యాస దీపికలు వార్షిక  పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించాడానికి ఉపయోగ పడతాయన్నారు. ప్రతి విద్యార్థి చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మానస,శర్మ,యాకూబ్ పాషా, ఐత మహేందర్,చంద్రప్రకాష్,ఓస్ సందీప్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -