నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో చదువుచున్న ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఎఫ్సెట్ ,వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను ఉచితంగా అందజేశామని ప్రిన్సిపాల్ నందాల గంగాకిశోర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ముఖ్యంగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలోజీ , తదితర పుస్తకాలు ఎంతో ఉపయోగకమని అన్నారు. విద్యార్థులు తప్పక ఈ పుస్తకాలను బాగా చదవాలని అన్నారు. ఇంటర్ చదువుతోపాటు వివిధ పోటీ పరీక్షల కోసం ఈ ఎఫ్సెట్ పుస్తకాలు ప్రయోజనకారిగా పని చేస్తాయని అన్నారు.
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సి హెచ్ రమణకుమార్ చొరవతో ఈ పుస్తకాలు మద్నూరు తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలకు వచ్చాయని అన్నారు. సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రముఖపద్యకవి డా బి. వెంకట్, సీనియర్ అధ్యాపకులు -బచ్చు సుమన్, వేణుగోపాల్, గంగా ప్రసాద్, రాము, నరహరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.