Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేత..

విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని ఆలేరు గ్రామ  జెడ్పిహెచ్ఎస్  పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఏ రాందాస్  అధ్యక్షతన నాల్ల ఓం ప్రకాశ్  పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేసినట్లు ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఆ గ్రామ ఉపసర్పంచ్ గన్న హరీష్ తో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు ఉన్నంత స్థాయికి చేరుకోవాలని మెటీరియల్ అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మెటీరియల్స్ .పాఠశాల విద్యార్థులకు మెటీరియల్స్  ను అందించిన దాత నాల్ల ఓం ప్రకాశ్  అభినందించారు.

సహాయం చేసే గుణం అందరికీ ఉండదని కొంతమందే ప్రకాశ్  లాంటి వారుంటారని గుర్తు చేస్తూ , పదవతరగతి విద్యార్థులు ఈ మెటీరియల్ సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని కోరారు. మెటీరియల్స్ అందించటంలో సంధానకర్తగా వ్యవహరించిన ఆలేరు పాఠశాల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మహేశ్  ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ,ఉపాధ్యాయనీ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -