– మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య
– మండలంలో రూ.2లక్షల విలువైన పరికరాలు అందజేత
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సుమారు రూ. 2లక్షల విలువ కలిగిన స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసినట్లు మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం బాల్కొండలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతులమీదుగా క్రీడ పరికరాలు అందజేసినట్లు తెలిపారు. మండలంలోని చౌట్ పల్లి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు జిల్లా పరిషత్ బషీరాబాద్, కమ్మర్ పల్లి ఉన్నత పాఠశాలలకు, అమీర్ నగర్ మండల పరిషత్ ఉన్నత పాఠశాలకు క్రీడా పరికరాలు అందజేసినట్లు ఎంఈఓ తెలిపారు.
ఒక్కో పాఠశాలకు సుమారు సుమారు రూ.50వేల విలువ కలిగిన క్రీడా పరికరాలు అందించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రీడా సామాగ్రి అందజేసిన వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డికి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి, క్రీడా సామాగ్రి అందచేయడానికి కృషచేసిన బాల్కొండ పిడి జే.రాజ్ కుమార్ లకు మండల ప్రభుత్వ పాఠశాలల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ నాగేష్, ఉపాధ్యాయులు బంతిలాల్, అంజయ్య, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు బుర్ర నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా పరికరాల అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES