Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులకు పీఆర్టీయూ సంఘం ఒక వరం

ఉపాధ్యాయులకు పీఆర్టీయూ సంఘం ఒక వరం

- Advertisement -

మండల అధ్యక్షుడు యాదయ్య 
నవతెలంగాణ – నవాబు పేట
పీఆర్టీయు తెలంగాణ సంఘంలో సభ్యత్వం ఒక వరం అని, సంఘం బలంగా ఉంటే ఉపాధ్యాయుల సమస్యలు ఏదైనా సాధించవచ్చు విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది పీఆర్టీయు తెలంగాణ సంఘం మండల అధ్యక్షుడు యాదయ్య అన్నారు. శనివారం నవాబ్ పేట్ మండలంలోని కొల్లూరు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల చివరిలోపు ఉపాధ్యాయుల జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయని తెలిపారు. ఉపాధ్యాయుల పిఆర్సి కోసం ప్రత్యేక కార్యచరణ సంఘం చేపడుతుందని తెలియజేశారు.

పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ అకౌంట్లో జమ చేసే బాధ్యతను సంఘం తీసుకుంటుందని తెలియజేశారు. ఉపాధ్యాయుల ప్రధాన సమస్య అయిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సిపిఎస్ రద్దు చేసేంతవరకు సంఘం ముందుండి పోరాడుతుందని తెలియజేశారు. ఆగస్టు చివరి వరకు హెల్త్ కార్డులు వచ్చే విధంగా సంఘం ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఉపాధ్యాయులు లేవనెత్తితే వాటికి సమాధానాలు ఇచ్చారు. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సంఘంలో సంఘ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గౌడ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కృష్ణ సాగర్, శ్రీనివాస్ రెడ్డి, రామచంద్రయ్య రాష్ట్ర కార్యదర్శి ఓం ప్రకాష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -