Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం 

ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
‘సంఘమే శరణ్యం, అది లేకుంటే అరణ్యం’ అనే నినాదంతో సంఘాన్ని ముందుకు నడిపించడం సంతోషకరంగా ఉందని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గంగిశెట్టి రమేష్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనంలో పీఆర్టీయూ వ్యవస్థాపకులు సామల యాదగిరి జయంతిని పురస్కరించుకుని సంఘం ఆవిర్భావ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం పీఆర్టీయూ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎండీ యాకుబ్ పాషా తో కలిసి మాట్లాడారు.‌ నేడు ఉపాధ్యాయులు సాధించుకున్న హక్కులు పీఆర్టీయూ కృషి ఫలితమే అని పునరుద్ఘాటించారు.‌

పీఆర్టీయూ సంఘం ఉపాధ్యాయ లోకానికి కల్పవృక్షం లాంటిదని అన్నారు. ఉపాధ్యాయుల హక్కుల సాధనకు సంఘం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. పీఆర్టీయూ అత్యధిక సభ్యత్వం గల ఉపాధ్యాయ సంఘం అని కొనియాడారు. పెండింగ్ డీఏ లు, పీఆర్సీ, 317, 190, GO లు, పెండింగ్ బిల్లులు, టెట్ వంటి సమస్యల సాధన కోసం సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు శివరాత్రి అంజయ్య, సత్యనారాయణ, జిల్లా బాధ్యులు శ్రీధర్, వేణుమాధవ్,  వాణి, శ్రీను, రమేష్, మండల బాధ్యులు విద్యాసాగర్, రజిత, బాల రాజు, ఉమాదేవి, సత్యనారాయణ, కవిరాజు, కన్న వెంకట శ్రీనివాసరావు, రాజలింగం, సదయ్య, కరుణ, సువర్ణ,అంబా భవాని, CRP సంతోష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -