Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం

- Advertisement -

పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కొత్త నరసింహారెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు 

పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించినట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు కొత్త నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం ఆ సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో పథకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వర్గీయ సామల యాదగిరి స్థాపించిన పీఆర్టీయూ సంఘం అంచలు అంచలుగా ఎదిగి రాష్ట్రంలో 70 వేల సభ్యత్వం కలిగిన ఏకైక యూనియన్ పీఆర్టీయూ అన్నారు. ఈ యూనియన్ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అన్ని విధాలుగా విజయవంతమైందన్నారు. అనంతరం రిటైర్డ్ హెచ్ఎం మిట్టకోల రవిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర జిల్లా మండల నాయకులు  బి సాయిలు, సోమయ్య, రామ్మోహన్ రెడ్డి, జలగం శ్రీనివాస్, ఫణీంద్ర, యుగంధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -