Sunday, January 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులకు పీఆర్టీయూ అండగా ఉంటుంది

ఉపాధ్యాయులకు పీఆర్టీయూ అండగా ఉంటుంది

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని మునిపల్లి మండల పిఆర్టియు అధ్యక్షులు చంద్రమౌళి పేర్కొన్నారు. శనివారం ఆయన పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం కాలమానిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ.. సంఘం ఆవిర్భావం తర్వాత నాటి నుంచి నేటి వరకు కూడా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పి ఆర్ టి యు అహర్నిశలు కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు మునిపల్లి మండల శాఖ ప్రధాన కార్యదర్శి సురేందర్, జిల్లా నాయకులు ఉమేష్, ఇతర సంఘం ప్రతినిధులు గోపాల్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -