Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుపీఆర్టియు తెలంగాణ నూతన కార్యవర్గం ఎన్నిక

పీఆర్టియు తెలంగాణ నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
నాగర్ కర్నూల్ జిల్లా పిఆర్టియు తెలంగాణ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, సాయి రెడ్డి లు తెలిపారు. ఈ కార్యవర్గానికి పరిశీలకులుగా సోషల్ మీడియా కన్వీనర్ శివరామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కన్వీనర్లు, హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉపాధ్యాయ సమస్యల పైన రాజీలేని పోరాటం చేస్తూ ఈ మధ్యలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించిన ఘనత పిఆర్టియు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి అను నిత్యం అధికారుల వెంట ఉండి ఇప్పించడం జరిగిందన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో సుమారుగా 108 మంది ఎస్జిటి ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ గా,  ఎనిమిది మంది స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి లభించిందని అన్నారు. ఇంకా జిల్లాలో ప్రైమరీ పాఠశాలలను బలోపితం చేయాల్సిన అవసరం ఉందని శివరామకృష్ణ అన్నారు. జిల్లా అధ్యక్షులు గా లక్ష్మీనారాయణ,  ప్రధాన కార్యదర్శిగా ఎస్. సాయి రెడ్డిలు తిరిగి రెండో సారి ఎన్నికయ్యారు. గతంలో డిప్యూటేషన్లు ఇచ్చిన వారి స్థానంలో అక్కడ  పోస్టులు భర్తీ కావడంతో తిరిగి వారిని మాతృ పాఠశాలలకు పంపాలని, అదేవిధంగా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయున్ని  నియమించాలని సూచించారు. 

అతి త్వరలో జీవో 317 ఉపాధ్యాయులకు తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సాయిరెడ్డి అన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని,  ఈ సంవత్సరం పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు తొందరలోనే విడుదల చేయాలని,  అదే విధంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని జిల్లా అధికారులను కోరడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని పిఆర్టి తెలంగాణ నాయకులు జైపాల్ రెడ్డి, అశోక్, శేఖర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad