నవతెలంగాణ – చిగురుమామిడి: పిఆర్టియు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 2025 సంవత్సరానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం చిగురుమామిడి మండలంలో ఘనంగా ప్రారంభించబడింది. ఉపాధ్యాయ సంఘ సభ్యత్వ నమోదు ప్రక్రియను మండలంలోని పాఠశాలలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ ఉపాధ్యక్షుడు శ్రీ దుబ్బాక బాల్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు జయప్రద మేడం, మండల అధ్యక్షుడు ఇనుగాల లింగారెడ్డి,కార్యదర్శి మళ్లీనాధ శాస్త్రి,రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్, ఓదెల్ కుమార్, అనిల్, రఘుపతి రెడ్డి, జిల్లా బాధ్యులు రాజేశ్వర్ రెడ్డి, రామ్ కిరణ్, తిరుపతి నాయక్, శివరాం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పెండింగ్ బిల్స్ పరిష్కరించేందుకు సంఘం నడుంకట్టిందని, పిఆర్సి విషయంలో కూడా ప్రభుత్వం తో చర్చించి ఉపాధ్యాయులకు న్యాయం సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు సంఘ బలోపేతానికి తమ స్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మండలంలో పిఆర్టియు టిఎస్ సభ్యత్వ నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES