నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గురువారం పీఆర్ టి యు టీఎస్ మండల కార్యవర్గ సమావేశం బోడ. దేవానందం అధ్యక్షతన నిర్వహించినారు. పీఆర్టియు టీ ఎస్ జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శుల సూచన మేరకు త్వరలో మండలంలోని అన్ని పాఠశాలల్లో పీఆర్టియుటీఎస్ సభ్యత్వ నమోదు చేయించబోతున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన పీఆర్టియు టీఎస్ జిల్లామాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ పి జలంధర్ పీఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుకునూరు ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు టీ. హరిచరణ్ హాజరు కాగా, వారికి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించినారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై తమ జిల్లా, రాష్ట్ర సంఘం విశేష కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సి.వి.నరసింహారావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పతాని గంగాధర్, విజయ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సురేష్, రాష్ట్ర కార్యదర్శులు దత్త ప్రసాద్, చంద్రదేవ్, మండల కార్యదర్శి రాకేష్ కుమార్, సంఘ సభ్యుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పిఆర్టియూ టిఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES