Monday, May 19, 2025
Homeజాతీయంపీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగం విఫలం..

పీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగం విఫలం..

- Advertisement -

– మూడవ దశలో సాంకేతిక లోపం…
స్రూళ్లూరుపేట : తిరుపతి జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు నిర్వహించిన పిఎస్‌ఎల్‌వి-సి61 ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో చైర్మెన్‌ వి నారాయణన్‌ ప్రకటించారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సాయంతో ఇఒఎస్‌ 09 శాటిలైట్‌ను భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులో సన్‌ సింక్రోనస్‌ పోలార్‌ ఆర్బిట్‌లో ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఇందుకోసం ఈ రాకెట్‌ 17 నిమిషాల 39 సెకన్ల పాటు నాలుగు దశల్లో రాకెట్‌ ప్రయాణించాల్సి ఉంది. మొదటి, రెండు దశల వరకు దీని ప్రయాణం సాఫీగానే సాగింది. మూడో దశలోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో రాకెట్‌ నిర్దేశిత మార్గంలో కాకుండా మరో మార్గంలో ప్రయాణించడం మొదలు పెట్టింది. ఇందులో లోపం ఎక్కడ తలెత్తిందన్న వివరాలను విశ్లేషణ తర్వాత వెల్లడిస్తామని ఇస్రో చైర్మెన్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -