Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్డివో కార్యాలయంలో ప్రజావాణి : కలెక్టర్

ఆర్డివో కార్యాలయంలో ప్రజావాణి : కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం రాబోయే సోమవారం సాధారణంగా జరిగే కలెక్టరేట్ మీటింగ్ హాల్ (IDOC) లో కాకుండా జిల్లా కేంద్రంలోని ఆర్.డి.ఓ కార్యాలయం సమావేశ మందిరం (రూమ్ 3)లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 27వ తేదీన ఎక్సైజ్ శాఖ లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కార్యక్రమం నిర్ణయించబడిన కారణంగా ప్రజావాణి ప్రదేశం తాత్కాలికంగా మార్పు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయాన్ని గమనించి, నిర్దిష్ట సమయానికి ఆర్.డి.ఓ కార్యాలయం సమావేశ మందిరం వద్ద హాజరు కావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -