జాతీయ జెండాలను ఆవిష్కరించిన మంత్రులు, స్పీకర్లు
నవతెలంగాణ- విలేకరులు
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు, అసెంబ్లీ, శాసనమండలి స్పీకర్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించారు. మెదక్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి, సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ, సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, రంగారెడ్డి కలెక్టరేట్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హాజరయ్యారు.
ఖమ్మం జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర సమరంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక ప్రత్యేక చరిత్రను సొంతం చేసుకుందన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు వీరోచిత పోరాటం చేసిన అనేక మంది అమరులయ్యారని గుర్తు చేశారు. వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్నారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ములుగు జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, వరంగల్ ఐడిఓసి కార్యాలయం వద్ద మంత్రి కొండా సురేఖ, హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES