Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమాచార శాఖలో ప్రజాపాలన

సమాచార శాఖలో ప్రజాపాలన

- Advertisement -

కార్యాలయం ఆవరణ పరిశీలన
ఫైళ్లను తనిఖీ చేసినస్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్ర సమాచార ప్రధాన కార్యాలయం సమాచార్‌ భవన్‌లో శుక్రవారం నుంచి జూన్‌ 12 వరకు 99 రోజుల పాటు ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మాసాబ్‌ట్యాంక్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌ ప్రియాంక, డైరెక్టర్‌ కిషోర్‌బాబు, అదనపు డైరెక్టర్‌ డిఎస్‌ జగన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌ ప్రియాంక మొక్కలు నాటారు. కార్యాలయం ఆవరణలోని పరిసరాలను, కార్యాలయంలోని ప్రతి సెక్షన్‌ను తనిఖీ చేశాను. ఫైళ్లను పరిశీలించారు.

అనంతరం అధికారులు సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి సెక్షన్‌లో ఉన్న ఫైళ్లను సక్రమంగా, పరిశుభ్రంగా నిర్వహించాలనీ, పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. నిర్దేశించిన కాలం అనంతరం పాత వార్షిక ఫైళ్లను స్టోర్‌ రూమ్‌లో క్రమపద్ధతిలో భద్రపరచాలని సూచించారు. బీరువాలు, డెస్క్‌ల్లో రన్నింగ్‌ ఫైళ్లను మాత్రమే ఉండచాలని స్పష్టం చేశారు. అధికారులు సెక్షన్‌ ఉద్యోగుల గదులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ కమిషనర్‌తో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీర్‌ వి. రాధాకిషన్‌ ఆర్‌ఐలు జె. రాములు, పి. జయరాంమూర్తి, ఉప సంచాలకులు యం. మధుసూదన్‌, వై. వెంకటేశ్వర్లు, ఎస్‌.ఏ, హష్మి, రాజరెడ్డి, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -