Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వైయస్సార్ స్ఫూర్తితో ప్రజాపాలన

వైయస్సార్ స్ఫూర్తితో ప్రజాపాలన

- Advertisement -

ప్రజా సంక్షేమ స్ఫూర్తిదాత వైయస్సార్ 
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ 
ఘనంగా వైయస్సార్ 16వ వర్ధంతి వేడుకలు 
నవతెలంగాణ – పాలకుర్తి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనను కొనసాగిస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ 16వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు మంగళవారం పాలకుర్తి తో పాటు తీగారం లో వైయస్సార్ చిత్రపటానికి, విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్ తో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ స్ఫూర్తిదాత డాక్టర్ వైయస్సార్ అని కొని ఆడారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు వైయస్సార్ సేవలు చిరస్మరణీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లావుడియా భాస్కర్, పోగు శ్రీనివాస్, గడ్డం యాక సోమయ్య, కే శ్రీనివాస్, గుగ్గిళ్ళ ఆదినారాయణ, గోనె మహేందర్ రెడ్డి, కమ్మగాని నాగన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోని అశోక్ రెడ్డి, పెనుగొండ రమేష్, ఎండి మదర్, ఎండి సలీం, నీరటి చంద్రయ్య, బేతి కుమార్, సలేంద్ర సంపత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad