Saturday, March 7, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామాల్లో ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమాలు

గ్రామాల్లో ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమాలు

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామపంచాయతీ ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీ వాసాల నరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాల  అంగన్వాడీ సెంటర్‌ను సందర్శించి పరిసరాల్లో శానిటేషన్ పనులు చేయించడం జరిగింది.

గ్రామంలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాల మరియు అంగన్వాడీ పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు. పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో  బస్టాండ్ ఏరియాలో బ్లీచింగ్ పౌడర్ చల్లి చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. సర్పంచి జక్కు సుష్మ భూమేష్  పంచాయతీ ఈవో రాహుల్ , పాల్గొన్నారు.

తిమ్మాపూర్ లో అంగన్వాడి కేంద్ర పరిసరాలను పరిశుభ్రం చేయించి, ఆ గ్రామ సర్పంచి గుగులవత్ సంగీత, పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మేక లావణ్య అంగన్వాడి టీచర్ జాడీ సంజీవరామ్ తో కలిసి పాల్గొన్నారు. జన్నారం సర్పంచి అజ్మీర కళావతి నందు నాయక్ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా అన్ని గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలను ఆయా గ్రామాల సర్పంచులు కార్యదర్శులు అధికారులు  పాల్గొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -