Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -


నవతెలంగాణ -పెద్దవూర
ప్రజాపాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజా పాలన ప్రత్యేక దీక్షిత్ కుమార్ అధికారి అన్నారు. గురువారం మండలంలోని చలకుర్తి గ్రామం లోనిర్వహించిన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర గీతం తో ప్రారంభించి మాట్లాడారు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వం వివిధ పథకాలు మరియు సాధించిన విజయాలపై వివరంగా వివరించారు.

రైతు భరోసా కింద లబ్దిదారుల మరియు ఇతర పథకాల కింద లబ్దిదారుల పేర్లను చదవడం, లబ్దిదారుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు,మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రూ.500 కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్,గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,సన్నరకం వరికి బోనస్,
చేయూత పెన్షన్లు,కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి – స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు కొత్త రేషన్ కార్డులు, మొదలైనవి పథకాల గురించి గ్రామ సభల్లో చర్చించామన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం,మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్య వరకు పొడిగింపు, ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులైన విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు, పంటల వైవిధ్యీకరణ, ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం,గ్రామాల వారీగా సమస్యల గుర్తింపు మరియు ఆ సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని సంబందిత అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సల్లఅంజిరెడ్డి, కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -