Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 142 ఆర్జీలను సమర్పించారు. ఫిర్యాదుదారుల నుండి  జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, లోకల్ బాడీస్ చందర్ నాయక్ తో కలిసి  జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad