Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పోలీసులపై ప్రజలకు విశ్వసనీయత పెరిగింది

పోలీసులపై ప్రజలకు విశ్వసనీయత పెరిగింది

- Advertisement -

పోలీస్ విభాగం ద్వారా ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంకులో నాణ్యత ప్రమాణాలు పాటింపు
రాష్ట్ర పోలీసు హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐజి రమేష్ రెడ్డి
నవతెలంగాణ – వనపర్తి 

పోలీస్ సంక్షేమ విభాగం నుంచి ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ పంపు ప్రజల నమ్మకం మేరకు నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పోలీసు హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐజి రమేష్ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. సోమవారం వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో వనపర్తి పోలీస్ శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐజి రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్తానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి పెట్రోల్ బంకు ను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పోలీసులపై విశ్వసనీయత పెరిగిందని అన్నారు. వనపర్తి జిల్లాలో పోలీస్ విభాగం ద్వారా పెట్రోల్ బంకు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇస్తే జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి , స్తానిక శాసన సభ్యులు వేగంగా స్పందించి అనతి కాలంలోనే అన్ని అనుమతులు ఇవ్వడంతో షరవేగంగా కేవలం 4 నెలల వ్యవధిలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. 

    అలాగే ఈ ప్రాంతంలో భవిష్యత్తులో బైపాస్ రోడ్డు, మదనపురం రైల్వే నుంచి వనపర్తి వరకు కొత్త క్యారిడార్ నాలుగు లైన్ల రోడ్లను నిర్మిస్తే వాణిజ్యపరంగా అభివృద్ధి చెంది మరిన్ని సంస్థలు ఏర్పాటు అవుతాయని తద్వారా నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యశాఖ తరపున 47 కోట్లతో వనపర్తి జిల్లాకు ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్ మంజూరు అయిందని తెలిసిందని, అది కూడా నెలకొల్పితే ఈ ప్రాంతం వాణిజ్యపరంగా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. పోలీసుల మీద పెరుగుతున్న నమ్మకానికి అనువుగా పెట్రోల్ పంపు నిర్వహణలో పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజల ఆదరణ మరింత పొందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా జస్టిస్ రిపోర్టులో భారతదేశంలోనే తెలంగాణ పోలీసులు ప్రథమ స్థానంలో ఉండడం చాలా గర్వకారాణమన్నారు. పోలీసు వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పెరిగింది.

వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘరెడ్డి పోలీసులు ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యలను పరిష్కరిస్తుండడంతో పోలీస్ విభాగం పై ప్రజలకు మంచి నమ్మకం పెరిగిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. అందులో భాగంగానే పట్టణ శివారులో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. పెట్రోల్ బంకుల్లో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తారనే నమ్మకం ప్రజలకు ఉంటుందని తెలిపారు. అలాగే రాబోవు రోజుల్లో కొత్తకోట, వనపర్తి క్యారీడర్ ఏర్పాటు కోసం చేసిన ప్రతిపాదనలను ఆర్ అండ్ బి మంత్రికి ఇవ్వడం జరిగింది అన్నారు. దీంతోపాటుగా వనపర్తికి ఒక బైపాస్ రోడ్డు కూడా పెబ్బేరు కనెక్టింగ్ చేస్తూ ప్రతిపాదించడం జరిగింది అన్నారు. అది కూడా మంజూరు అయిందని త్వరలోనే పనులు చేస్తామన్నారు. నాణ్యత ప్రమాణాలు పెంచితే.. పెట్రోల్ వినియోగం పెరుగుతుంది – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లాలో ఏర్పాటుచేసిన పోలీస్ పెట్రోల్ బంక్ లో క్వాలిటీ, క్వాంటిటీ పారదర్శకంగా ఉంటుందని అన్నారు.

అందుకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పెంచితే మరింతగా పెట్రోల్ వినియోగం జరుగుతుందని అన్నారు. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ప్రత్యేక చొరవ తీసుకొని కొద్ది నెలలోనే పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం కీలక పరిణామం అన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ తో పాటు వారి సిబ్బందిని అభినందించారు. త్వరలోనే అంతే వేగవంతంగా మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే పెట్రోల్ బంకులను పూర్తిచేయాలని ఐఓసీఎల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐ ఓ సి ఎల్ అధికారులు సుమిత్ర, శరణ్య, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు, సిఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad