- Advertisement -
- అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత
– రైతులు రీ సర్వేలో భాగస్వాములు కావాలి
-సర్వే అనంతరం భూదార్ కార్డులు జారీ - నవతెలంగాణ-రాయికల్
- మండలంలోని దావన్‌పల్లి గ్రామంలో భూభారతి-2025 భూ సర్వే కార్యక్రమంలో భాగంగా రీ సర్వే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత హాజరై మాట్లాడుతూ.. గ్రామంలో కొత్తగా భూ సమస్యలు తలెత్తకుండా ఉండటంతో పాటు, పాత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేందుకు రీ సర్వే కీలకమని తెలిపారు. రైతులు తప్పనిసరిగా ఈ సర్వేలో భాగస్వాములు కావాలని సూచించారు.
- సర్వే అనంతరం భూదార్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో సర్వే నిర్వహించి భూముల సరిహద్దులను ఖచ్చితంగా నమోదు చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్,తహసీల్దార్ నాగార్జున, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే కిషన్ ప్రసాద్,డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే విఠల్ రావు,రెవెన్యూ ఇన్స్పెక్టర్ పద్మయ్య,మండల సర్వే అధికారి నరేందర్,గ్రామ సర్పంచ్ ప్రసాద్,జీపీఓలు లావణ్య,స్వప్న పాల్గొన్నారు.
- Advertisement -



