నవతెలంగాణ – కంఠేశ్వర్
మండల కేంద్రంలో గురువారం ప్రజానాట్యమండలి నగర కమిటీ ఏరియా మహాసభ నిర్వహించారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్ లో ఏరియా మహా సభ జరిగి కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్పలింగం మాట్లాడుతూ.. ప్రజానాట్యమండలి 1943 లో ఏర్పడి ఈనాటికి 80 సంవత్సరాలు దాటింది ఈ నాట్యమండలి నుండి అనేక కళారూపాలు సామాజిక రుగ్మతలపై నాటికలు వీధి నాటికలు ప్రదర్శించడం జరిగింది. అక్షరాస్యత సారా ఉద్యమం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఇలాంటి కార్యక్రమాల్ని ఎన్నో కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల మధ్యకు కళారూపాన్ని తీసుకువెళ్లింది. కాబట్టి రేపు 23న జరిగే జిల్లా మహాసభను ప్రజలు కళాకారులు వచ్చి అంతం చేయా స్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర ఏరియా కమిటీ సభ్యులు అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు సుదర్శన్, అధ్యక్షులు విజయ, మాల ఉపాధ్యక్షులు గంగన్న, ప్రధాన కార్యదర్శి ఎం నర్సారెడ్డి, సహాయ కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్, కోశాధికారి ప్రభాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆంజనేయులు, మిగతా కార్యవర్గ సభ్యుని ఎన్నుకున్నారు



