Wednesday, March 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలునాన్ బెయిలేబుల్ వారెంట్లను తగ్గించిన పోలీస్ కమీషనర్

నాన్ బెయిలేబుల్ వారెంట్లను తగ్గించిన పోలీస్ కమీషనర్

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్ లలో గత చాలా రోజుల నుండి పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ల (ఎన్ బి డబ్ల్యూ) సంఖ్యను తగ్గించడానికి నిజామాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇటీవల కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి అని నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలియజేయడం జరిగింది. మార్చ్ 20 నుండి మార్చ్ 24 వరకు పోలీస్ కమీషనరేట్ పరిధిలో నాన్- బెయిలబుల్ కేసుల విషయం లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ప్రకారం నిర్వహించడం జరిగింది. 
పెండింగ్ లో గల వారెంట్ల అమలు
కోర్టులు జారీ చేసిన వారెంట్లను త్వరితగతిన అమలు చేయాలని , ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నిందితులను పట్టుకోవాలని పోలీస్ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేకబృందాలు
82 , 83 ప్రోసిడింగ్ ప్రకారంగా నేరస్థులకు సంబంధించిన స్థిర ఆస్తులు మరియు చర ఆస్తులను జప్తు చేసుకొనే అవకాశం గలదు.  కొద్దిమంది బ్రతుకు తెరువు నిమిత్తము గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిపై ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్, కు సంబంధించినటువంటి కేసులలో 03 లుక్ అవుట్ సర్కులర్ జారీ చేయడం జరిగింది.

 ఎన్‌.బి.డబ్ల్యు లను తగ్గించడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి , ఈ నాలుగు రోజులలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నాన్-బెయిలబుల్ వారెంట్లు మొత్తం 105 కేసులను పరిష్కారం చేయడం జరిగింది. వేరే రాష్ట్రాలలో పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసి 09 మంది కి ఎన్.బి.డబ్ల్యు ఎగ్జిక్యూషన్ చేసినారు. అదేవిధంగా వేరే జిల్లాలలో పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసి 04 నిందితులకు ఎన్.బి.డబ్ల్యూ ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది.

కోర్టు సమన్వయం
కోర్టు విచారణలకు నిందితులు హాజరయ్యేలా చూడటం ద్వారా మరియు పాత 55 కేసుల్లో ఎన్.బి.డబ్ల్యూ వారెంట్లను క్లియర్ చేయడం ద్వారా పెండింగ్ సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

నేర నియంత్రణ కార్యక్రమం లో కేసుల సమీక్ష
క్రైమ్ మీటింగ్‌ల ద్వారా పెండింగ్ వారెంట్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ , గడువులోగా వాటిని పరిష్కరించేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -