Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా పాలన గ్రామసభలు విజయవంతం చేయాలి

ప్రజా పాలన గ్రామసభలు విజయవంతం చేయాలి

- Advertisement -

అదనపు కలెక్టర్ యారాల అశోక్ రెడ్డి 
నవతెలంగాణ – కట్టంగూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన 99రోజుల ప్రగతి ప్రణాళికా గ్రామ సభలను విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యారాల అశోక్ రెడ్డి అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులు ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి గ్రామాలను అభివృద్ధి చేయాలని అన్నారు.

మండలంలోని 22 గ్రామపంచాయతీలలో గురువారం గ్రామసభలను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమములో మండల ప్రత్యేక అధికారి జి. సతీష్ కుమార్, మండల అభివృద్ది అధికారి పి. జ్ఞాన ప్రకాష్ రావు, తహశీల్దార్ పుష్పలత, మండల పంచాయితీ అధికారి కె. స్వరూప రాణి, ఏపీఓ కడెం రామ్మోహన్, మండల పంచాయితీ కార్యదర్శుల సంఘం కట్టేబోయిన పెద్దయ్య, ప్రదాన కార్యదర్శి వడ్లకొండ అశోక్, పలు గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పంచాయితీ కార్యదర్శులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -