Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్రాహ్మణ కొత్తపల్లిలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక

బ్రాహ్మణ కొత్తపల్లిలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక

- Advertisement -

99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం
పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి శరత్
నవతెలంగాణ-నెల్లికుదురు 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం గ్రామపంచాయతీ బ్రాహ్మణ కొత్తపల్లి ఆధ్వర్యంలో ప్రజలకు తడి చెత్త పొడి చెత్త నిర్వహణ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్బిఎమ్ కోఆర్డినేటర్ జిల్లా అధికారి శ్రీ రవి కుమార్ ఆ గ్రామ కార్యదర్శి శరత్ తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త ఏ విధంగా నిర్వహించాలో ప్రజలకు  క్లుప్తంగా వివరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా వివరించడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఇంటి వద్దనే తడి చెత్త పొడి చెత్త వేరుచేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్లో వేయాల్సిందిగా వారికి సూచించడం జరిగింది. తడి చెత్త ద్వారా సంపద అనే అంశం మీద  ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పిట్టల ఉప్పలయ్య, వార్డు సభ్యులు సరిత, మహేశ్వరి,పంచాయతీ కార్యదర్శి శరత్, అంగన్వాడి టీచర్లు ఆయాలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -