Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించే “ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ   మందిరంలో కలెక్టర్,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. 

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ 99 రోజులకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి అన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పూర్తి నివేదికలు తయారు చేయాలన్నారు.శానిటేషన్, పెండింగ్ ఫైల్స్,రెవిన్యూ శాఖ లో పెండింగ్ ఫైల్స్, హెల్త్, హౌసింగ్, ఎడ్యుకేషన్, అంగన్వాడీ, అగ్రికల్చర్, హాస్టల్, ధాన్యం కొనుగోలు, వంటి వివిధ శాఖల అధికారులు విధి విధానాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జయ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -