నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఇందిరమ్మ ఆశయం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం నేరల్ల గ్రామం లో ఇందిరమ్మ ఇళ్లు కు బుధవారం లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వం లో నిజమైన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కు ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేసి తీరుతామని వివరించారు.లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నర్సింగం గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగాల భూపతి, సత్తు శ్రీనివాసరెడ్డి, మునిగల రాజు,గుగ్గిళ్ళ భరత్, గ్రామ శాఖ అధ్యక్షుడు కోలశంకర్ ,ఆనందం, ఎల్లయ్య శ్రీను నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఆశయం దిశగా ప్రజా పాలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES