– ఆర్‌యూపీపీటీఎస్ కృతజ్ఞతసభలో మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో భాషాపండితులకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందనీ, వారి పక్షానే ఉంటుందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రకాశం హాల్‌లో ఆర్‌యూపీపీటీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత సభ పేరుతో విద్యాసదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిపోయిన భాషాపండితులను అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలలో తెలుగు, హిందీ, ఉర్దూ పండిత పోస్టులను ప్రాథమిక స్థాయిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావిజన్‌తో పనిచేస్తున్నదని వివరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యారంగంపై తగిన దృష్టిపెట్టకుండా విస్మరించిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ఏర్పాటు చేసి విద్యాహబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నదని వివరించారు. ఆర్‌యూపీపీటీఎస్‌కు శాశ్వత గుర్తింపునిచ్చేందుకు సహాయసహకారాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌యూపీపీటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింహులు, గౌరవ సహాదారులు హర్షవర్ధన్‌రెడ్డి, గౌరవాధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్, ప్రధాన కార్యదర్శి శశియాదవ్, సంయుక్త కార్యదర్శి అమీర్‌పాషా, సీనియర్ సలహాదారులు గోపాల్‌జీ, సహాధ్యక్షులు వివేక్ భవాని, వెంకటస్వామి, ఎంఏ మన్నన్, వీరేందర్‌గౌడ్, శ్రీనివాసులు, సుధాకరాచారి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పండితులకు అండగా ప్రజాప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES