నవతెలంగాణ – దర్పల్లి
పరిశుద్యం బాగుంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ అన్నారు. శనివారం అయన మండలకేంద్రములోని 11వ వార్డులోని సమస్యలను తెలుసుకొని వార్డును సందర్శించారు. ప్రధాన సమస్య ఐన డ్రైనేజి వాటి పక్కనే చెత్త చెదారం, పిచ్చి మొక్కలను గమనించి అప్పటికప్పుడే పంచాయతీ కార్మికులను పిలిపించి వెంటనే వాటిని తొలగించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ.. గ్రామస్థులు పరిశుద్యం పై దృష్టి పెట్టాలని అన్నారు. డ్రైనేజి బాగుండాలి. మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.సమస్యలు ఏమైనా ఉంటే తనదృష్టికి తేవాలని అన్నారు. కార్యక్రమములో అయన వెంట వార్డు సభ్యులు చక్రపాణి, శ్రవణ్, వినయ్, అజయ్, బద్దం గంగారెడ్డి, బూర్గుల గోపి, కాలానివాసులు పాల్గొన్నారు.
పారిశుధ్యంతోనే ప్రజారోగ్యం: సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



